naveen murder case: నవీన్ హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన నిహారిక!
- హరిహరకృష్ణకు సహకరించారన్న ఆరోపణలతో అరెస్టయిన హసన్, నిహారిక
- ఏ3 ముద్దాయిగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిహారిక
- కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటికి
తెలంగాణలో సంచలనం రేపిన నవీన్ హత్య కేసులో నిందితురాలు నిహారిక జైలు నుంచి విడుదలైంది. ఈ కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న నిహారికను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చర్లపల్లి జైలు నుంచి నిహారిక ఈరోజు ఉదయం రిలీజ్ అయింది.
నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించారన్న ఆరోపణలతో హసన్, నిహారికను పోలీసులు ఫిబ్రవరి 6న అరెస్ట్ చేశారు. హత్య జరిగిన విషయాన్ని దాచి, హత్యకు సహకరించిందని నిహారికను కూడా నిందితురాలిగా చేర్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హయత్ నగర్ కోర్టులో వారిద్దరినీ హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇటీవల బెయిల్ కోసం నిహారిక దరఖాస్తు చేసుకోగా.. శనివారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆమె బయటికొచ్చింది.
తన స్నేహితుడు నవీన్ ను హరిహరకృష్ణ కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ శరీరాన్ని ముక్కలుగా కోసి గుండెను బయటికి తీశాడు. నిహారికను వేధిస్తున్నాడనే కోపంతోనే నవీన్ ను చంపినట్లు పోలీసుల విచారణలో హరిహరకృష్ణ ఒప్పుకున్నాడు.