ICET: ఏపీలో ఐసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
- ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్
- మే 24, 25 తేదీల్లో ఐసెట్
- మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు
- మే 20 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఐసెట్. ఈ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 సంవత్సరానికి గాను దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభం అయింది. ఏపీలో ఈ ఏడాది ఐసెట్ పరీక్షను అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఐసెట్ కన్వీనర్ తో పాటు ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా దీనిపై వివరాలు తెలిపింది.
- దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకోవాలి
- మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తు చార్జీ రూ.650
- బీసీలకు దరఖాస్తు చార్జీ రూ.600
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.550
- మే 24, 25 తేదీల్లో ఐసెట్ పరీక్షలు
- రెండు షిఫ్టులలో పరీక్షలు
- ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష
- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష
- మే 20 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు