K Kavitha: నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి ఈడీ విచారణకు కవిత
- పిళ్లై జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- కవితను ఇంకా విచారిస్తున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. మరోవైపు ఈరోజు ఈడీ విచారణకు కవిత రెండోసారి హాజరయ్యారు. ఈ స్కామ్ లో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నాలుగు గంటల సేపు ప్రశ్నించినట్టు సమాచారం.
అనంతరం పిళ్లై కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరోవైపు కవితను ప్రస్తుతం ఈడీ అధికారులు ఒంటరిగా విచారిస్తున్నారు. ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? లేక విచారణ అనంతరం పంపించేస్తారా? అనే విషయంలో టెన్షన్ నెలకొంది.