Delhi Capitals: స్వల్ప స్కోర్ల పోరులో ఢిల్లీ పైచేయి... పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

Delhi Capitals beat Mumbai Indians by 9 wickets

  • ముంబయి ఇండియన్స్ ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 రన్స్ చేసిన ముంబయి
  • 9 ఓవర్లలోనే కొట్టేసిన ఢిల్లీ క్యాపిటల్స్

డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబయి ఇండియన్స్ ను వెనక్కినెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో నెగ్గారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ను ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులతో సరిపెట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరిజేన్ కాప్ 2, శిఖా పాండే 2, జెస్ జొనాస్సెన్ 2, అరుంధతి రెడ్డి 1 వికెట్ తీశారు. 

అనంతరం 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 9 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి విజయఢంకా మోగించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 32 (నాటౌట్), షెఫాలీ వర్మ 33 (15 బంతుల్లో), అలిస్ కాప్సే 38 నాటౌట్ (17 బంతుల్లో) ధాటిగా ఆడడంతో గెలిచేందుకు ఢిల్లీకి ఎక్కువ సమయం పట్టలేదు. ముంబయి బౌలర్లలో హేలీ మాథ్యూస్ 1 వికెట్ సాధించింది. 

ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ కు చేరింది. ముంబయి కూడా 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.

  • Loading...

More Telugu News