TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక భర్తపై ప్రభుత్వం వేటు
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం
- కీలక సూత్రధారి రేణుక, ఆమె భర్త ఇప్పటికే అరెస్ట్
- ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్యా నాయక్
- తొలగిస్తూ డీఆర్డీఏ ఉత్తర్వులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితురాలు రేణుక భర్తపై ప్రభుత్వం వేటేసింది. పేపర్ లీకేజీ కేసులో మరో నిందితుడైన రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కులకచర్ల ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తాజా కేసు నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ డీఆర్డీఏ పీడీ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో భార్యాభర్తలైన రేణుక, డాక్యానాయక్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డాక్యా నాయక్ జైలులో ఉండడంతో ఉత్తర్వులు ఆయనకు అందించే వీలు లేకుండా పోయింది. దీంతో గండీడ్ మండలం పంచాంగల్ తండాలోని ఆయన కుటుంబ సభ్యులకు వాటిని అందజేశారు.