Digestive: ఇవి తింటే గ్యాస్ సమస్యలు దూరం!

Boost Your Digestive Health With These Nutrient Rich Foods

  • అన్ని పదార్థాలూ జీర్ణానికి అనుకూలం కాదు
  • కొన్నింటితో జీర్ణాశయంపై అదనపు భారం
  • పీచుతో కూడిన పదార్థాలతో సానుకూల ప్రయోజనాలు

పేగులు ఆరోగ్యంగా ఉండాలి. లేదంటే కడుపుబ్బరం, గ్యాస్ తదితర ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేడు జీర్ణ సంబంధిత సమస్యలు పెరిగాయి. ఎందుకంటే మన ఆహార అలవాట్లు, వేళలు మారిపోవడం వల్లేనని అర్థం చేసుకోవాలి. కొన్ని రకాల పదార్థాలు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటాయి. కొన్ని చాలా వేగంగా అరిగిపోతాయి. కనుక మనం తీసుకునే పదార్థాలు మన జీర్ణాశయ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పీచుతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఇందుకు కీలకం అవుతుంది. 

ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, తోటకూర, క్యాబేజీ ఇవన్నీ కూడా పీచు దండిగా ఉన్నవి. ఇవి పేగులకు ఆరోగ్యాన్నిస్తాయి. కనుక వీటిని తరచుగా తీసుకోవడం అవసరం.

ముడి ధాన్యాలు
ముడి ధాన్యాల్లో పీచు ఉంటుంది. పోషకాలు కూడా పోవు. పాలిష్ చేసిన ధాన్యాలను వాడుకోవద్దు. వైట్ బ్రెడ్ లో మైదా పిప్పి తప్ప ఏమీ ఉండదు. దీనికి బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవాలి. మైదాతో చేసిన ఏ పదార్థాలు కూడా తీసుకోవద్దు. శనగపిండి, మల్టీ గ్రెయిన్ పిండితో చేసిన రోటీలు, ఇతర పదార్థాలు తినొచ్చు. 

పండ్లు
యాపిల్స్, పియర్స్, మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. అదే బ్లూ బెర్రీలు, కమలా, బత్తాయి, స్ట్రాబెర్రీ వంటి సిట్రస్ జాతి పండ్లలో ఫ్రక్టోస్ తక్కువగా ఉంటుంది. కనుక తక్కువ ఫ్రక్టోస్ ఉన్న పండ్లను రోజువారీగా తప్పకుండా తినాలి. 

ప్రొటీన్
లీన్ ప్రొటీన్ ఉన్నవి తీసుకోవాలి. మాంసంలో ఫ్యాట్ ఎక్కువ. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, ముఖ్యంగా రెడ్ మీట్ తో సమస్యలు వస్తాయి. దీనికి బదులు బీన్స్, పప్పులు తినడం వల్ల స్వచ్ఛమైన లీన్ ప్రొటీన్ తక్కువ పరిమాణంలో అందుతుంది.

యుగర్ట్, పెరుగు
ఇవి కూడా జీర్ణాశయ ఆరోగ్యాన్నిస్తాయి. ఇందులో ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పేగుల ఆరోగ్యానికి ఇది సాయపడుతుంది. వీటితో మంచి బ్యాక్టీరియా అందుతుంది. గ్యాస్, కడుపుబ్బరం, మంట సమస్యలను తగ్గిస్తాయి. యుగర్ట్, పెరుగు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే పోషకాలు వేరు. యుగర్ట్ లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బీ12 ఉంటే, పెరుగులో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ బీ6 ఉంటాయి. యుగర్ట్ అన్నది వాణిజ్య ఉత్పత్తి. కంపెనీలే తయారు చేయగలవు. పెరుగును మనమే స్వచ్చందంగా చేసుకోవచ్చు. 

చియా సీడ్స్
వీటిల్లోనూ ఫైబర్, ప్రొబయాటిక్ ప్రాపర్టీలు ఉంటాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు సాయపడుతుంది. నీటిలో నాన బెట్టి తినడం మంచిది.

  • Loading...

More Telugu News