K Kavitha: కవిత విచారణ మధ్యలో ఆమె న్యాయవాదిని పిలిపించిన ఈడీ అధికారులు
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
- కవితను ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన ఈడీ
- నేడు మూడో విడత విచారణ
- కవితను గత 8 గంటలుగా ప్రశ్నిస్తున్న వైనం
- ఈడీ కోరిన పత్రాలు తీసుకువచ్చిన కవిత న్యాయవాది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణకు హాజరైన కవిత, నేడు మూడో దఫా ఈడీ కార్యాలయానికి వచ్చారు. గత 8 గంటలుగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాగా, విచారణ మధ్యలో ఈడీ అధికారులు కవిత న్యాయబృందానికి కబురు పంపారు.
దాంతో కవిత న్యాయవాది సోమ భరత్ హుటాహుటీన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కోరిన సమాచారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సోమ భరత్ వెంట బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ కూడా ఉన్నారు.
కాగా, కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయం 3వ ఫ్లోర్లో కవిత విచారణ కొనసాగుతోంది.