Adhar card: ఆధార్- ఓటర్ ఐడీ లింక్ గడువు పెంపు

Adhar and voter Id link date Extended till 2024 march 31

  • మరో ఏడాది పాటు పొడిగించిన కేంద్రం
  • 2024 మార్చి 31 లోగా లింక్ చేసుకోవాలి
  • ఈ నెల 31తో ముగియనున్న ఆధార్ పాన్ లింక్ గడువు

ఓటర్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. వచ్చే నెల 1తో ఈ గడువు ముగియనుండగా.. మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఆధార్, ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు 2024 మార్చి 31న ముగుస్తుందని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఓటర్లు ఫారం 6-బి సమర్పించాల్సి ఉంటుంది.
 
కాగా, ఆధార్ ఓటర్ ఐడీ లింక్ కోసం గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది. డిసెంబర్ 12 నాటికే 54.32 కోట్ల ఆధార్ నెంబర్లు సేకరించినట్లు సమాచారం. అయితే, వీటిని అనుసంధానించే ప్రక్రియ మాత్రం ఇంకా మొదలుకాలేదని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చింది.

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి తుది గడువు సమీపిస్తోంది. ఈ నెలాఖరు (మార్చి31) తో ఈ గడువు ముగియనుంది. గడువు ముగిశాక పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన నేపథ్యంలో ఇక పొడిగించే అవకాశం లేదని అధికారవర్గాల సమాచారం. అయితే, తుది గడువును మరోమారు పొడిగించాలంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.వెయ్యి అపరాధ రుసుమును కూడా ఎత్తేయాలంటూ కోరుతున్నాయి. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ లేఖ కూడా రాసింది.

  • Loading...

More Telugu News