Hindenburg Research: మరో బాంబ్ పేల్చనున్న హిండెన్ బర్గ్.. ఈ సారి ఎవరి వంతో?
- ‘బిగ్ వన్’పై త్వరలో హిండెన్ బర్గ్ రిపోర్ట్
- ట్విట్టర్ లో ప్రకటించిన అమెరికన్ సంస్థ
- ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా నివేదిక
- దీని ఫలితంగా 50 శాతానికి పైగా పడిపోయిన అదానీ షేర్లు
హిండెన్ బర్గ్ అనే అమెరికన్ సంస్థ గురించి భారత ఇన్వెస్టర్లకు ఇప్పుడు ప్రత్యేక పరిచయం చేయక్కర్లేదు. ఒక్క నివేదికతో అదానీ గ్రూప్ విలువకు 50 శాతం తూట్లు పొడిచిన సంస్థ ఇది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయని, విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటున్నట్టు ఈ సంస్థ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదిక అదానీ గ్రూపు షేర్లను కుదిపేసింది. ఏకంగా సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించే వరకు వెళ్లింది.