dark circles: కళ్ల కింద నల్లటి వలయాలు.. పరిష్కార మార్గాలు

From lifestyle to genetics What really causes dark circles and how to fix them

  • వయసు మీదపడుతున్న వారికి ఇది సహజమే
  • వయసులో ఉన్న వారికి వస్తే కారణం గుర్తించాలి
  • జన్యు సంబంధిత సమస్యలు ఒక కారణం
  • తగినంత నిద్ర లేకపోయినా, పోషకాల లోపంతో కనిపించొచ్చు

చూడ్డానికి అందమైన రూపం ఉంటుంది. కానీ పరిశీలించి చూస్తే కళ్ల కింది భాగంలో నల్లటి వలయాలు (మచ్చ) కనిపిస్తాయి. ఈ సమస్య ఎంతో మందిని బాధపెడుతుంటుంది. ముఖ్యంగా అందానికి ప్రాధాన్యమిచ్చే వారు దీనితో మానసికంగా వేదనకు గురవుతుంటారు. వీటిని డార్క్ సర్కిల్స్ అంటారు. వీటిరి తగ్గించుకునేందుకు ఎన్నో పరిష్కార మార్గాలున్నాయి. 

అసలు నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? అన్నదానిపై అవగాహన ఉండాలి. జన్యు సంబంధిత కారణాలతో ఇవి రావచ్చు. జీవనశైలి అలవాట్ల వల్ల, పలు అనారోగ్యాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. వయసు పెరుగుతున్న క్రమంలోనూ రావచ్చు. కళ్ల కింద ఉన్న చర్మం కొవ్వుని, కొల్లాజెన్ ను కోల్పోతుందన్నది అర్థం. దీనికి నిదర్శనంగా చర్మంలోపలి సూక్ష్మ రక్తనాళాలు బ్లూ రంగులో కనిపిస్తుంటాయి. కారణం ఏంటన్నది గుర్తించినట్టయితే చికిత్స చాలా సులభం. 

అర్గాన్ ఆయిల్ ను ప్రతి రోజూ రాత్రి కళ్ల కింద రాసుకుని మర్ధన చేసుకోవాలి. అలోవెరా ప్యాక్ వేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే కంట్లోకి ఏదీ పోకుండా జాగ్రత్తపడాలి. తగినంత నిద్ర లేకపోయినా కళ్ల కింద మచ్చలు కనిపిస్తాయి. నిండు నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. కళ్లను నలపడం, రాత్రి వేళల్లో సరైన సమయానికి పడుకోకుండా ఫోన్లు, టీవీలు చూడడం కూడా ఈ సమస్యను తెచ్చి పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన పోషకాహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్రించడం, కళ్ల కింద సరిగ్గా శుభ్రం చేసుకోవడం, ఆలోచనలు తగ్గించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. అప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మిగిలి ఉన్న మార్గం.

  • Loading...

More Telugu News