Sensex: తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 289 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 75 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 1.69 శాతం పతనమైన ఎస్బీఐ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు నష్టపోయి 57,925కి పడిపోయింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 17,076 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.25%), మారుతి (1.18%), భారతి ఎయిర్ టెల్ (0.99%), టాటా మోటార్స్ (0.73%), ఐటీసీ (0.68%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.69%), ఏసియన్ పెయింట్స్ (-1.49%), కోటక్ బ్యాంక్ (-1.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.40%), రిలయన్స్ (-1.28%).