Nani: రవితేజతో కలిసి నాని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ స్టెప్.. వీడియో ఇదిగో!

Nanis Dhoom Dham Dostan step with Ravi Teja Heres the video
  • దసరా సినిమా ప్రమోషన్లలో బిజీగా నాని
  • నానితో కలిసి చిన్న స్టెప్ వేసిన రవితేజ
  • ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు డ్యాన్స్
‘దసరా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో నాని. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ దూసుకెళ్తున్నాడు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు చుట్టేస్తున్నాడు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు వీలైనంత పబ్లిసిటీ తీసుకొస్తున్నాడు.

తాజాగా ఈ ప్రమోషన్లలో హీరో రవితేజ కూడా పాలుపంచుకున్నాడు. నానితో కలిసి చిన్న స్టెప్ వేశాడు. దసరా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు కాలు కదిపాడు. కుర్చీపై కూర్చుని ఇద్దరు హీరోలు వేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన 'దసరా'.. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ లుక్ లో నాని సరికొత్తగా కనిపించాడు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, సాయికుమార్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
Nani
Raviteja
Dhoom Dham Dostan
dasara
Keerthy Suresh

More Telugu News