DA: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
- 4 శాతం మేర పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటన
- 38 నుంచి 42 శాతానికి పెరిగిన ఉద్యోగుల డీఏ
- 2023 జనవరి 1 నుంచి పెంపు వర్తింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. 4 శాతం మేర కరవు భత్యం పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తాజా పెంపుతో కేంద్రంపై రూ.12,815 కోట్ల భారం పడుతుందని తెలిపారు.
కాగా, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ ఇస్తున్నారు. ఇప్పుడు 4 శాతం పెంపుతో డీఏ 42 శాతం అయింది. కేంద్రం నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులకు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.