Yanamala: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కాగ్ చెప్పింది: యనమల
- ఏపీలో మూలధన వ్యయం 9.21 శాతానికి తగ్గిందన్న యనమల
- ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని వెల్లడి
- రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమంపై ఖర్చు అంతంతేనని వివరణ
ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కాగ్ చెప్పిందని యనమల వెల్లడించారు. ఆదాయం, వ్యయం, అప్పు, అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.
ఏపీలో మూలధన వ్యయం 9.21 శాతానికి తగ్గిందని చెప్పారు. రెవెన్యూ రాబడి 28.53 శాతం పెరిగినా, సంక్షేమంపై ఖర్చు అంతంత మాత్రమేనని వివరించారు. కొత్త అప్పుల్లో 80 శాతం పాత అప్పులు తీర్చేందుకే సరిపోతుందని యనమల స్పష్టం చేశారు.