LVM-3: శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 రాకెట్
- వాణిజ్య ప్రయోజనాల కోసం ఎల్వీఎం-3 రాకెట్ కు రూపకల్పన
- కౌంట్ డౌన్ పూర్తి కాగానే నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసిన రాకెట్
- 36 ఉపగ్రహాలను మోసుకెళుతున్న ఎల్వీఎం-3
ఇస్రా వాణిజ్య ప్రయోజనాల కోసం రూపొందించిన ఎల్వీఎం-3 రాకెట్ శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉదయం 9 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే నిప్పులు చిమ్ముకుంటూ పైకి ఎగిసింది.
బ్రిటన్ సంస్థ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ మోసుకుని వెళుతోంది. ఉపగ్రహాల మొత్తం బరువు 5.8 టన్నులు. వీటిని ఎల్వీఎం-3 రాకెట్ వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ ఉప్రగహ వాహకనౌక రోదసిలో చేపడుతున్న వివిధ ప్రక్రియలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు.