Anand Mahindra: పారిశ్రామికవేత్తలు సండే ఏం చేస్తారు..?.. ఆనంద్ మహీంద్రా అదిరే సమాధానం

Anand Mahindra technique to enjoy on a Sunday deserves your attention

  • ఆనంద్ మహీంద్రాను ట్విట్టర్ లో ప్రశ్నించిన ఓ యూజర్
  • తాను పారిశ్రామిక వేత్తననే విషయాన్ని మర్చిపోతానంటూ బదులు
  •  ఒక్క వాక్యంలో ఎంతో చెప్పారు సర్ అంటూ ప్రశంసలు 

సామాన్యులు, సంపన్నుల్లో అభిరుచులు వేర్వేరుగా ఉంటుంటాయి. వీకెండ్ వస్తే వీలుంటే రెస్టారెంట్, మూవీ, లేదంటే ఏదైనా ఊరెళ్లి వద్దామనుకుంటారు సామాన్య, మధ్యతరగతి వాసులు. బద్ధకస్తులు అయితే గుర్రు పెట్టి పడుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ధనికులు, మరీ ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు సండే వస్తే ఏం చేస్తారు..? ఈ సందేహమే ఓ వ్యక్తికి వచ్చింది. ‘‘సర్ నాదొక చిన్న ప్రశ్న. అంత పెద్ద పారిశ్రామికవేత్త అయిన తర్వాత కూడా మీరు ఆదివారాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?’’ అని అభిషేక్ జైస్వాల్ అనే వ్యక్తి ట్విట్టర్ పై ఆనంద్ మహీంద్రాకు ప్రశ్న సంధించాడు. 

అంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ, ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలపై సమాచారం షేర్ చేసుకునేందుకు రోజులో కొంత సమయం కేటాయిస్తుంటారు. జైస్వాల్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘ఆదివారం రోజున నేనొక పారిశ్రామికవేత్తననే విషయాన్ని మర్చిపోతాను’’ అని బదులిచ్చారు. ఈ సమాధానం చాలా మంది కళ్లు తెరిపించింది. ఆనంద్ మహీంద్రా చెప్పింది ఎంతో బావుందంటూ యూజర్లు స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వాక్యంలో ఎంతో చెప్పారు సర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. 

ఇక పనిలో పనిగా ఆనంద్ మహీంద్రా ఓ చిన్న వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. సండే ఫీలింగ్ ను తెలియజేసేందుకు ఇంతకంటే ఏదైనా మంచి క్లిప్ ఉందా? అని ప్రశ్నించారు. ఓ మోటారు సైక్లిస్టు తన పెంపుడు కుక్కని షోల్డర్ బ్యాగ్ లో కూర్చోబెట్టి భుజాన వేసుకున్నాడు. కుక్క సైతం నల్లటి కళ్లద్దాలు ధరించింది.

  • Loading...

More Telugu News