Manchu Manoj: కొత్త జీవితం ప్రారంభించా.. మీడియాతో మంచు మనోజ్

manchu manoj skips manchu vishnus topic infront of media
  • శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ సందడి 
  • సినిమా లేకపోతే తనకేమీ లేదని వెల్లడి
  • అన్నతో గొడవపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని మనోజ్
రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో మంచు మనోజ్ సందడి చేశారు. ఈ సందర్భంగా తన బుజ్జి తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మనోజ్ చెప్పారు. ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతోపాటు త్వరలోనే తాను ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.

‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకొక సంతోషకరమైన జీవితాన్నిఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘నాకు సినిమానే లైఫ్. మీరే (ప్రేక్షకులే) నా జీవితం. సినిమా లేకపోతే నాకేమీ లేదు. మళ్లీ సినిమాకే వస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే మంచు విష్ణుకు, తనకు మధ్య జరిగిన వివాదంపై మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే విష్ణు గురించి మనోజ్ మాట్లాడలేదని తెలుస్తోంది. 

మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఇటీవల బయటపడిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు. వివాదంపై స్పందించిన విష్ణు.. తమ మధ్య ఉన్నది పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని చెప్పుకొచ్చారు.
Manchu Manoj
Manchu Vishnu
Manchu Lakshmi
Mohan Babu
manchu brothers

More Telugu News