Virat Kohli: 9వ తరగతి పరీక్షల్లో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. నెట్టింట వైరల్

Virat Kohli based question in Class 9 exam paper sends fans into frenzy

  • ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ పై కోహ్లీ సెంచరీ
  • నాటి ఫొటోను ఉంచి డిస్క్రిప్షన్ రాయంటూ విద్యార్థులకు ప్రశ్న
  • తాను అయితే ఓ పుస్తకమే రాస్తానన్న ఒక యూజర్

విరాట్ కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. భారత్ నుంచి గొప్ప క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకడు. అతడు ఇప్పటి వరకు దేశం తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. టీమిండియాకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. అలాంటి విరాట్ కోహ్లీ గురించి 9వ తరగతి పరీక్షా ప్రశ్నా పత్రంలో ఓ ప్రశ్న సంధించారు. క్రీడల పట్ల విద్యార్థుల్లో అవగాహన, జీకేని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ ఫొటోని ఉంచి, దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని కోరారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది పెద్ద వైరల్ గా మారింది. కోహ్లీకి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో కోహ్లీ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘‘దీన్నే సక్సెస్ అంటారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇమేజ్ పై నేను ఒక పుస్తకమే రాస్తాను. ఈ ఫొటో చూసి చెప్పేందుకు ఎంతో ఉంది’’ అని పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News