EC: ఓటర్ల నమోదు, సవరణల కోసం కొత్త పోర్టల్
- ఇప్పటివరకు nvsp పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు
- దాని స్థానంలో voters.eci.gov.in పోర్టల్
- నూతన పోర్టల్ తో బీఎల్ఓ, ఈఆర్ఓల సమాచారం పొందే వీలు
దేశంలో కొత్త ఓటర్ల నమోదు, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పోర్టల్ ను తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఎన్వీఎస్పీ స్థానంలో ఇక నుంచి కొత్త పోర్టల్ ద్వారా సేవలు అందించాలని ఈసీ నిర్ణయించింది. ఇకపై voters.eci.gov.in పోర్టల్ ద్వారా ఓటర్ల నమోదు తదితర ప్రక్రియలు కొనసాగుతాయని వివరించింది. ఈ నూతన పోర్టల్ ద్వారా బీఎల్ఓ, ఈఆర్ఓల సమాచారం పొందే వీలుంటుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది.