Karnataka: కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఇప్పటి వరకు పడని అనర్హత వేటు

Two BJP MLAs of Karnataka not disqualified so far even after court punished them for jail imprisonment

  • రాహుల్ కు కోర్టు జైలు శిక్షను విధించిన మరుసటి రోజు ఎంపీ సభ్యత్వంపై వేటు
  • ఒక బీజేపీ ఎమ్మెల్యేకు రెండేళ్లు, మరొకరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టులు
  • వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, లోక్ సభ సెక్రటేరియట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. మరోవైపు కర్ణాటకలోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులు శిక్ష విధించి రెండు నెలలు దాటిపోతున్నా వారిపై ఇంత వరకు అనర్హత వేటు వేయలేదు. 

కాంట్రాక్టు పనుల్లో రూ. 50 లక్షల అవినీతి కేసులో నేరం రుజువుకావడంతో హావేరీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కి రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. చిక్ మగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News