Samantha Ruth Prabhu: ఇచ్చినంత తీసుకోవడమే.. అడుక్కోకూడదు!: సమంత

Samantha Ruth Prabhu talks about pay parity wants people to pay her willingly I shouldnt have to beg for it
  • మహిళలకూ సమాన పారితోషికంపై సమంత స్పందన
  • ఇష్టపూర్వకంగానే మహిళలకు చెల్లించాలన్న అభిప్రాయం
  • విజయానికి ఉప ఉత్పత్తిగా తాను సినిమాను చూస్తున్నట్టు వెల్లడి
సినీ పరిశ్రమలో పురుష నటులతో సమానంగా మహిళా నటులకు పారితోషికం చెల్లించాలన్న డిమాండ్ పై ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు స్పందించింది. వారంతట వారే ఇష్టపూర్వకంగా మహిళలకు చెల్లించాలి కానీ, అందుకోసం అడుక్కోకూడదన్న అభిప్రాయాన్ని సమంత వ్యక్తం చేసింది. పింక్ విల్లా అనే మీడియా సంస్థతో సమంత మాట్లాడింది.

‘‘నేను చాలా గట్టిగా పోరాడుతున్నాను. కానీ నేరుగా కాదు. సమాన పారితోషికం చెల్లింపుల కోసం నేను పోరాడడం లేదు. కష్టపడడానికి, విజయానికి ఉప ఉత్పత్తి సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇంత మొత్తం చెల్లిస్తామంటూ వారు వచ్చి చెబుతుంటారు. అంతేకానీ, ఇంత ఇవ్వాలని నేనేమీ అభ్యర్థించను. ఇది అద్భుతమైన కృషితో వస్తుందని నేను నమ్ముతాను’’ అని సమంతా చెప్పింది.  మీ సామర్థ్యాలను పరిమితి మేరకు, అంతకంటే కొంచెం ఎక్కువే వెలికితీయడానికే ప్రయత్నించండనే కొటేషన్ రాసుకుంటానని తెలిపింది. పరిమితికి మించి సామర్థ్యాలన్నవి మరింత కష్టపడడం ద్వారానే వస్తుందని పేర్కొంది.
Samantha Ruth Prabhu
pay parity
beg

More Telugu News