TTD: మొరాయించిన దేవస్థానం వెబ్సైట్..అరగంటలోపు సమస్యను పరిష్కరించిన టీటీడీ
- వర్చువల్ సేవ ఏప్రిల్ నెల టిక్కెట్లను విడుదల చేసిన టీటీడీ
- సమ్మర్ సీజన్ కావడంతో టీటీడీ వెబ్‌సైట్‌కు తాకిడి
- హెవీ హిట్స్ రావడంతో నిలిచిపోయిన సైట్
- 20 నిమిషాల్లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన టీటీడీ
టీటీడీ ఏప్రిల్ నెల వర్చువల్ సేవ టిక్కెట్లను విడుదల చేసిన నేపథ్యంలో దేవస్థానం వెబ్‌సైట్‌కు మంగళవారం ఒక్కసారిగా విజిటర్స్ తాకిడి పెరిగింది. దీంతో వెబ్సైట్ కాసేపు మొరాయించింది. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ అధికారులు 20 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించారు. అనంతరం..బుకింగ్స్‌ను పునరుద్ధరించారు. ఇది సమ్మర్ సీజన్ కావడంతో టీటీడీ వెబ్సైట్ విపరీతంగా హిట్స్ వచ్చాయి.
రోజుకు ఐదు వేలు చొప్పున ముప్పై రోజులకు 1.5 లక్షల టిక్కెట్లను టీటీడీ తాజాగా విడుదల చేసింది. అయితే.. ఇంతకుమించిన స్థాయిలో భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో వెబ్సైట్ తట్టుకోలేకపోయింది. దీనికి తోడు.. దర్శన టిక్కెట్ల కోసం కూడా భక్తుల తాకిడి పెరగడంతో సైట్ కాసేపు స్తంభించింది. ఇదిలా ఉంటే.. నిన్న దర్శన టిక్కెట్లు విడుదల చేసిన సందర్భంలోనూ భక్తులు భారీ సంఖ్యలో వెబ్‌సైట్‌ను సందర్శించారు.