AB De Villiers: కోహ్లీని మొదటిసారి చూసినప్పుడు అహంకారి అనుకున్నా: డివిలియర్స్

AB De Villiers talks about Kohli

  • మరి కొన్నిరోజుల్లో ఐపీఎల్-16 ప్రారంభం
  • ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గేల్, డివిలియర్స్
  • మొదట్లో కోహ్లీని చూడగానే ఏమనిపించిందన్న గేల్

ఐపీఎల్ 16వ సీజన్ ఈ నెల 31న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట్లో విరాట్ కోహ్లీని చూడగానే ఏమనిపించింది అని గేల్... డివిలియర్స్ ను అడిగాడు. 

కోహ్లీని మొట్టమొదట చూడగానే అహంకారి అనిపించిందని డివిలియర్స్ బదులిచ్చాడు. అతడి జుట్టు, ఆడంబరాలు చూసి అలా అనుకున్నానని వివరణ ఇచ్చాడు. కోహ్లీతో సన్నిహితం కావడం కష్టమనిపించిందని, అతడు నింగి నుంచి నేలకు దిగాల్సిన అవసరం ఉందని భావించానని వెల్లడించాడు. 

అప్పట్లో కోహ్లీ పద్ధతులు తనకు నచ్చేవి కావని స్పష్టం చేశాడు. అయితే, కోహ్లీ ఆట తీరు చూశాక అభిప్రాయాన్ని మార్చుకున్నానని, అతడి ఆత్మవిశ్వాసం అద్భుతమని కొనియాడాడు. కోహ్లీలో ఉన్న మానవతా దృక్పథాన్ని దగ్గరగా గమనించిన తర్వాత అతడంటే గౌరవభావం ఏర్పడిందని డివిలియర్స్ తెలిపాడు. ఇప్పుడు కోహ్లీ అంటే అత్యున్నత వ్యక్తిత్వానికి మారుపేరు అని ఒకప్పటి తన సహచరుడి గురించి వివరించాడు.

  • Loading...

More Telugu News