Kiran Abbavaram: ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటాను: కిరణ్ అబ్బవరం

Meter trailer launch event
  • కిరణ్ అబ్బవరం నుంచి 'మీటర్'
  • ఏప్రిల్ 7వ తేదీన విడుదల 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్ 
  • తన కెరియర్లో పెద్ద సినిమా అని చెప్పిన కిరణ్
కిరణ్ అబ్బవరం తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మీటర్' రెడీ అవుతోంది. క్లాప్ - మైత్రీ బ్యానర్ వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. అతుల్య రవి కథానాయికగా పరిచయం కానున్న ఈ సినిమా, ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 

ఈ వేదికపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. "నిన్ననే నేను ఈ సినిమాను చూశాను .. ఇంత పెద్ద సినిమాను చేశానా? అనిపించింది. ఈ సినిమాపై మీరు అంచనాలు పెంచుకోవచ్చు .. ఆ అంచనాలను అందుకునేలానే ఈ సినిమా ఉంటుంది. జాబ్ మానేసి ఇండస్ట్రీకి వచ్చాను. నిన్నటితో ఐదేళ్లు పూర్తయింది. ఈ ఐదేళ్లలో 6 షార్టు ఫిల్మ్ లు .. పెద్ద బ్యానర్లలో 7 సినిమాలు చేశాను" అన్నాడు. 

"అసలు నిద్రపోతున్నావా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఇక ఇక్కడ కాస్త గ్యాప్ తీసుకుంటాను. ఇప్పటివరకూ సంపాదించిన అనుభవంతో మరిన్ని మంచి ప్రాజెక్టులను సెట్ చేసుకుంటాను. 'మీటర్' విషయానికి వస్తే, నేను ఇంతవరకూ చేసినవాటిలో ఇది పెద్ద సినిమా. ట్రైలర్ లో ఏదైతే స్పీడ్ కనిపించిందో .. సినిమా మొత్తం కూడా అదే స్పీడ్ కనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie

More Telugu News