Tripura Assembly: త్రిపుర అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడు పని.. వీడియో వైరల్!

BJP MLA caught watching porn on mobile during Tripura Assembly session
  • ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కిన బీజేపీ ఎమ్మెల్యే
  • అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సమయంలో నిర్వాకం
  • వివరణ ఇవ్వాలని ఆదేశించిన బీజేపీ
ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాడు పని చేశారు. అశ్లీల దృశ్యాలు చూస్తూ కెమెరాలకు చిక్కారు. ఒక పక్క సమావేశాలు జరుగుతుంటే.. ఇటు పక్క ఈయన వీడియోలు చూడటంలో మునిగిపోయారు. త్రిపుర అసెంబ్లీలో జరిగిందీ ఘటన.

బీజేపీ ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్.. బగ్బసా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా తన ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు. ఆయన వెనకాల ఉన్న వారు ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. 

ఈ విషయంపై స్పందించిన బీజేపీ.. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అశ్లీల వీడియోలు చూశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే నాథ్ ఇంకా స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. సిగ్గుచేటు అని ట్వీట్ చేశారు. 

ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో అశ్లీల దృశ్యాలు చూస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. 2012లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు మంత్రులు పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు.
Tripura Assembly
BJP MLA caught watching porn
Jadab Lal Nath
bjp

More Telugu News