Andhra Pradesh: ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రేపు బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీలు
- బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
- ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ బంద్ కు ఆదివాసీల పిలుపు
- ఆదివాసీ సంఘాలకు మద్దతు తెలిపిన మావోయిస్టులు
బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న వారు ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివాసీల బంద్ కు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వీసులను రద్దు చేసింది. మరోవైపు పోలీసులకు ఆదివాసీ సంఘాలు ఒక విన్నపం చేశాయి. అరకు, బొర్రా గుహలకు సందర్శనకు వచ్చిన పర్యాటకులను హోటళ్లు, రిసార్టులు, లాడ్జీల నుంచి వెళ్లనీయవద్దని కోరాయి.