PM Modi: ఈ నెల 8న హైదరాబాద్‌కు ప్రధాని రాక

Modi coming to Hyderabad on April 8

  • సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న మోదీ
  • ఎంఎంటీఎస్ రెండో విడత సేవలను ప్రారంభించనున్న ప్రధాని
  • ఏర్పాట్లను పరిశీలించిన దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ కు వస్తున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో రైల్వే స్టేషన్ పునరభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్, ఫలక్ నుమా-ఉందానగర్ సబర్బన్ రైలు సేవలను ప్రారంభిస్తారు. మోదీ కార్యక్రమం నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కంటన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జే.రామకృష్ణ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. 

మరోవైపు, ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఇకపై ప్రధాని మోదీ నెలకోసారి తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నట్టు తెలిపారు. రూ. 13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఈ నెల 8న ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News