McDonalds: ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైన మెక్ డొనాల్డ్స్

McDonalds Temporarily Shuts US Offices and Prepares Layoff Notices

  • అమెరికాలోని పలు కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేత
  • లేఆఫ్ జాబితా తయారుచేస్తున్నారంటూ ప్రచారం
  • బుధవారం ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన?

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీ మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగాలు ఊడబోతున్నాయి. తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్దమైందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని పలు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగులలో కొంతమందికి ఉధ్వాసన తప్పదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.

సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచే పనిచేయాలంటూ మెక్ డొనాల్డ్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ వారంలో షెడ్యూల్డ్ మీటింగ్స్ మొత్తం రద్దు చేసుకోవాలని కూడా సూచించిందట. ఈమేరకు కిందటి వారం ఉద్యోగులకు ఈ మెయిల్ చేసిందని, అందులో లేఆఫ్స్ కు సంబంధించి సూచనప్రాయంగా తెలియజేసిందని వాల్ స్ట్రీట్ పేర్కొంది. ఉద్యోగ కోతలకు సంబంధించిన ప్రకటన బహుశా బుధవారం వెలువడవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News