Homemakers: గ్యాస్ ధర తగ్గించాలంటూ మహిళల డిమాండ్.. ఆర్థిక మంత్రి సీతారామన్ స్పందన
- తమిళనాడులోని ఓ గ్రామంలో మంత్రి సీతారామన్ పర్యటన
- చుట్టూ చేరి గ్యాస్ ధరలు తగ్గించాలని కోరిన గ్రామ మహిళలు
- అంతర్జాతీయ మార్కెట్లోని ధరలే నిర్ణయిస్తాయని తేల్చి చెప్పిన సీతారామన్
సామాన్యులకు వంటింటి గ్యాస్ భారంగా మారిపోయింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కోసం వారు ఇప్పుడు రూ.1,155 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కొలువు దీరడానికి ముందు, 2014 మార్చిలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.410. భవిష్యత్తులో మరో రూ.70 పెరిగితే మొత్తమ్మీద బీజేపీ పాలనలో రెండింతలు పెరిగినట్టు అవుతుంది.