Sobhita Dhulipala: సోదరి సమంతను పెళ్లి కుమార్తెగా చూసి కన్నీళ్లు వచ్చాయి: శోభిత ధూళిపాళ్ల
- విశాఖలో ఘనంగా జరిగిన శోభిత సోదరి సమంత వివాహం
- పెళ్లికూతురిగా సమంతను చూసి భావోద్వేగానికి గురయ్యానన్న శోభిత
- బంధువులందరం పెళ్లిలో కలుసుకున్నామన్న శోభిత
సినీ నటి శోభిత ధూళిపాళ్ల సోదరి సమంత వివాహం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో శోభిత కూడా పాల్గొన్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన మెహందీ, సంగీత్ ఫొటోలను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సోదరిని పెళ్లికూతురుగా చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. బంధువులందరం ఈ పెళ్లిలో కలుసుకున్నామని చెప్పారు. పెళ్లికి బాగా రెడీ కావాలని అనుకున్నానని... అయితే, పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల మెహందీ ఫంక్షన్ కు సరిగా రెడీ కాలేదని తెలిపారు. పెళ్లికూతురుగా ఉన్న సమంతను చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు.