CSK: చెపాక్ లో ఎగిరిన సీఎస్కే జెండా... సూపర్ జెయింట్స్ పై విక్టరీ

CSK beat LSG by 12 runs

  • చెన్నైలో సీఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
  • 12 పరుగుల తేడాతో నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్
  • సూపర్ జెయింట్స్ ముందు 218 పరుగుల టార్గెట్
  • 4 వికెట్లు తీసిన మొయిన్ అలీ
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులే చేసిన సూపర్ జెయింట్స్

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో ఓటమిపాలైన చెన్నై జట్టు... నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో నెగ్గింది. మొయిన్ అలీ 4 వికెట్లతో సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో లక్నో జట్టుకు శుభారంభం లభించింది. కైల్ మేయర్స్ (53), కేఎల్ రాహుల్ (20) జోడీ తొలి వికెట్ కు 79 పరుగులు జోడించింది. 

ఆ తర్వాత దీపక్ హుడా (2), కృనాల్ పాండ్యా (9) తక్కువ స్కోరుకే అవుట్ కాగా... మార్కస్ స్టొయినిస్ (21), నికోలాస్ పూరన్ (32) పోరాడినా, అది కాసేపే అయింది. చివర్లో రన్ రేట్ పెరిగిపోవడంతో, బరిలో ఉన్న ఆయుష్ బదానీ (23), కృష్ణప్ప గౌతమ్ (17 నాటౌట్) లకు శక్తికి మించిన పనైంది. దాంతో చివరికి లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 4, తుషార్ దేశ్ పాండే 2, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News