Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత డేటింగ్ పై స్పందించిన సమంత

Samantha Ruth Prabhu reacted on Naga Chaitanya Shobhita Dhulipala dating rumours
  • ప్రేమ విలువ తెలియని వారికి కన్నీరే మిగులుతుందంటూ వేదాంతం
  • కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలన్న ఆకాంక్ష
  • ప్రవర్తన మార్చుకుని, నొప్పించకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు ఎన్నో సందర్భాల్లో వదంతులు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫొటో కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్ లో శోభిత టేబుల్ వద్ద కూర్చోగా, దానికి ముందు చెఫ్ తో కలసి నాగ చైతన్య ఫొటోకి ఫోజునివ్వడాన్ని చూడొచ్చు. లండన్ పర్యటన సందర్భంగా ఈ ఫొటో తీసినట్టు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమంత ఓ వార్తా సంస్థతో మాట్లాడింది. ‘‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’’అని సమంత హుందాగా స్పందించింది.

ఎన్నో ఏళ్ల స్నేహం, ప్రేమ బంధం తర్వాత నాగచైతన్య, సమంత 2017 అక్టోబర్ లో వివాహం చేసుకోవడం తెలిసిందే. 2021లో వీరు పరస్పర అంగీకారంతో వైవాహిక బంధానికి ముగింపు పలికారు. తమ తమ మార్గాల్లో కొనసాగేందుకు వీలుగా భార్యాభర్తలుగా, తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమంత నాడు ప్రకటించడం తెలిసే ఉంటుంది.
Naga Chaitanya
Shobhita Dhulipala
dating
Samantha Ruth Prabhu

More Telugu News