Mask rule: థియేటర్లలో మళ్లీ మాస్క్ రూల్.. ఎక్కడంటే!

Tamilanadu governament re introduced mask must rule in movie theaters
  • కరోనా కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు సర్కారు నిర్ణయం
  • ఆసుపత్రులు, ఆడిటోరియాలలో కూడా మాస్క్ మస్ట్
  • రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువేనన్న ఆరోగ్య శాఖ డైరెక్టర్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో తమిళనాడు సర్కారు మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా థియేటర్లలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది.

కరోనా వ్యాప్తి పెరుగుతుండడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, ఏసీ థియేటర్లు, ఆడిటోరియాలలో మాస్కులు ధరించాలని చెప్పారు.
Mask rule
COVID19
Tamilnadu
virus cases
precaution

More Telugu News