NEET: ఎల్లుండితో ముగియనున్న 'నీట్' దరఖాస్తుల గడువు
- జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్
- ఈ ఏడాది మే 7న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష
- ఏప్రిల్ 6న దరఖాస్తులకు తుది గడువు
జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం మే 7వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఏప్రిల్ 6తో ముగియనుంది. మార్చి 6న నీట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నీట్ రాయాలనుకునే వారు ఎల్లుండి లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా, నీట్ రాసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.1700 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ కేటగిరీకి చెందినవారైతే రూ.1600... ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ కేటగిరీకి చెందినవారికి రూ.100 దరఖాస్తు రుసుంగా నిర్ణయించారు. అదే, ఎన్నారైలు నీట్ రాయాలనుకుంటే దరఖాస్తు రుసుంగా రూ.9,500 చెల్లించాల్సి ఉంటుంది.