Bandi Sanjay: బండి సంజయ్‌ను హనుమకొండ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Bandi sanjay appears in Hanumakonda majistrate court

  • పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ కేసులో సంజయ్ అరెస్ట్
  • సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చిన పోలీసులు 
  • కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
  • పోలీసులు, న్యాయవాదుల మధ్య వాగ్వాదం 

తెలంగాణ పదో తరగతి ప్రశ్న పత్రం కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హానుమకొండ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్దకు బీజేపీ శ్రేణులు తరలిరావస్తుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ సంజయ్‌ను పోలీసులు కోర్టు వెనుక ద్వారం గుండా తీసుకెళ్లారు. అంతకుమునుపు.. పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. బండి సంజయ్ తరఫు న్యాయవాదులను పోలీసులు కోర్టు లోపలికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య వాగ్వాదం నడిచింది. 

ఈ కేసులో పోలీసులు బండి సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చారు. మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ సంజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌కు వాట్సాప్‌లో ప్రశ్న పత్రం పింపించిన ఆరోపణపై ప్రశాంత్‌ను ఏ2 నిందితుడిగా పేర్కొన్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. 




  • Loading...

More Telugu News