Relangi Narasimha Rao: 36 ఏళ్లను పూర్తి చేసుకున్న 'పడమటి సంధ్యారాగం'

Padamati Sandhya Ragam movie celebrations

  • జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'పడమటి సంధ్యారాగం' 
  • ఈ నెల 11వ తేదీతో 36 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా 
  • సహనిర్మాతగా ఉన్న మీర్ అబ్దుల్లా 
  • ఆ దంపతులకు ఆదర్శ దంపతుల అవార్డు

జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలలో 'పడమటి సంధ్యారాగం' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. విజయశాంతి - థామస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 1987 ఏప్రిల్ 11వ తేదీన విడుదలైంది. అంటే ఈ నెల 11వ తేదీ నాటికీ ఈ సినిమా విడుదలై 36 సంవత్సరాలు పూర్తవుతాయి. ప్రేమకి ఆచారాలు .. సంస్కృతులు .. దేశాలు అడ్డుగోడలు కావని నిరూపించిన సినిమా ఇది. 

అలాంటి ఈ సినిమాకి గుమ్మలూరి శాస్త్రి - మీర్ అబ్దుల్లా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో మీర్ అబ్దుల్లా ఒక పాత్రను కూడా పోషించారు. ఈ సినిమాను గురించిన విశేషాలను గుర్తుచేసుకోవడం కోసం .. మీర్ అబ్దుల్లా - శ్రీమతి అజీజా దంపతులను ఆదర్శ దంపతులుగా సత్కరించుకోవడానికి గాను, 'వంశీ ఆర్ట్ థియేటర్స్ -  శుభోదయం గ్రూప్ వారు హైదరాబాద్ 'రవీంద్ర భారతి'లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.   

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. 'పడమటి సంధ్యారాగం' సినిమా 36 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పేరు వినగానే నాకు జంధ్యాల గారు గుర్తుకు వచ్చారు. కళాకారులు ఎక్కడ ఉన్నా వాళ్లంతా ఒక కుటుంబమని ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది. అలాంటి కళాకారుల కుటుంబానికి చెందిన మీర్ అబ్దుల్లా - అజీజా దంపతులకు ఆదర్శ దంపతులుగా 'గ్లోబల్ అవార్డు'ను ఇవ్వడం నిజంగా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అన్నారు.

  • Loading...

More Telugu News