Nara Lokesh: జగన్ కు సడన్ గా కాలినొప్పి రావడానికి కారణం ఇది... నారా లోకేశ్
- ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్ర
- ఇప్పటి వరకు 790 కి.మీ. మేర కొనసాగిన యాత్ర
- సైకో పని అయిపోయిందంటూ జగన్ పై లోకేశ్ విమర్శలు
టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర 61వ రోజును పూర్తి చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. కూడేరు మండలం గొట్కూరు వద్ద పాదయాత్ర ఉరవకొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నేతృత్వంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో యువనేతను సత్కరించి, ఆత్మీయస్వాగతం పలికారు. ఈరోజు 15.5 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర కూడేరులోని విడిది కేంద్రానికి చేరింది. గురువారం యువగళం పాదయాత్ర కోటంక వద్ద శింగనమల నియోజకవర్గంలో ప్రవేశించనుంది.
కూడేరు బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ, 'తాడేపల్లి ప్యాలెస్ సైకో పని అయిపోయింది... సైకిల్ పాలన రాబోతోంది. యువగళం పాదయాత్ర వైసీపీకి అంతిమ యాత్ర, యూత్ పవర్ ఏంటో జగన్ కి చూపించాం. 30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి జగన్ కి జ్వరం వచ్చింది. 61 రోజులు పూర్తయ్యే సరికి కాలి నొప్పి వచ్చింది. ఇక 400 రోజులు అయ్యే సరికి ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం. సడన్ గా కాలినొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా? పార్టీ ఓటమిని కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్నారట. అది తెలుసుకొని హాల్ లో ఉన్న టేబుల్ ని తన్నితే కాలు నొప్పి పెరిగింది.
నేను టెర్రరిస్టుని కాను వారియర్ ని అని ముందే చెప్పా. అయినా జగన్ వినలేదు. నన్ను అడ్డుకున్నాడు. కేసులు పెట్టాడు. ఇప్పుడు ప్రజలు జగన్ కి టెర్రర్ అంటే ఏంటో చూపించారు. యువగళం పాదయాత్ర వైసీపీకి అంతిమ యాత్ర కాబోతోంది. విండ్ పవర్, కియా, పరిశ్రమలను టీడీపీ ప్రత్యేకంగా రాయలసీమకు తెచ్చింది' అని తెలిపారు.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మూడు తరాలకు వారధి అని... తన తాతగారి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని, తన తండ్రిగారితో కలిసి పని చేశారని, ఇప్పుడు తనతో కలిసి నడుస్తున్నారని లోకేశ్ అన్నారు. కేశవ్ ను చూస్తే అధికార పక్షానికి వణుకు పుడుతుందని చెప్పారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అసెంబ్లీలో మైక్ కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
'ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని జగన్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా జగన్ మద్యం దుకాణాలు తెరిచాడు. ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ లాంటి చెత్త లిక్కర్ తయారు చేసి కోట్లు గడిస్తున్నాడు. లిక్కర్ లో జగన్ ఆదాయం నెలకి 100 కోట్లు. జగన్ ఎంత పాపం చేస్తున్నాడో తెలుసా... గత నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల విలువైన విషం కంటే ప్రమాదకరమైన లిక్కర్ తాగించాడు. ఒక్కో కేసు లిక్కర్ పై జే ట్యాక్స్ 10 రూపాయలు. 100 రూపాయలు విలువైన మద్యం అమ్ముతుంటే దానికి అవుతున్న ఖర్చు 15 రూపాయలు మాత్రమే. కానీ జగన్ బాదుడు అదనంగా 85 రూపాయలు. ఈ పాపం జగన్ ని ఊరికే వదలదు' అని లోకేశ్ అన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం 789.9 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 16.0 కి.మీ.
62వరోజు (6-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – కూడేరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – సంగమేష్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
9.35 – అరవకూరులో గ్రామస్తులతో సమావేశం.
11.45 – కమ్మూరు శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.45 – కమ్మూరు శివార్లలో భోజన విరామం
సాయంత్రం
3.45 – కమ్మూరు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశం, కోటంక వద్ద స్థానికులతో మాటామంతీ.
6.00 – కోటంక గండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు.
7.30 – మార్తాడు వద్ద విడిది కేంద్రంలో బస.