Nuclear Reactor: దేశంలో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటు

New nuclear reactors will be established in country

  • దేశంలో అణుశక్తి వినియోగం విస్తరణకు కేంద్రం చర్యలు
  • రాజస్థాన్ లో అత్యధికంగా 4 రియాక్టర్లు
  • యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ లో రెండేసి చొప్పున రియాక్టర్లు
  • పార్లమెంటులో వెల్లడించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

దేశంలో అణుశక్తి వినియోగం విస్తరణ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఐదు రాష్ట్రాల్లో కొత్తగా 10 అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

అత్యధికంగా రాజస్థాన్ లోని మహి బన్ స్వారా అణు విద్యుత్ ప్లాంట్ లో 4 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. యూపీలోని గోరఖ్ పూర్, కర్ణాటకలోని కైగా, మధ్యప్రదేశ్ లోని చుట్కా అణు విద్యుత్ ప్లాంట్లలో రెండేసి చొప్పున కొత్త అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. 

ప్రభుత్వ రంగ సంస్థలో ఎన్పీసీఐఎల్ జాయింట్ వెంచర్లు, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్రం 2015లో అణు ఇంధన చట్టాన్ని సవరించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News