Shardul Thakur: శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ బాదుడే బాదుడు... కోల్ కతా భారీ స్కోరు

Shardul Thakur and Rinku Singh hammers RCB bowling

  • ఐపీఎల్ లో నేడు ఆర్సీబీతో కేకేఆర్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
  • ఓ దశలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్ కతా
  • 29 బంతుల్లో 68 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్
  • 33 బంతుల్లో 46 పరుగులు చేసిన రింకూ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ బంతిని చితక్కొట్టాలన్న కసితో ఆడారు. వీళ్లద్దరి బాదుడుకు బెంగళూరు బౌలర్లకు దిమ్మదిరిగిపోయింది. శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ విజృంభణతో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

శార్దూల్ ఠాకూర్ కేవలం 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేయగా.... ఎడమచేతివాటం ఆటగాడు రింకూ సింగ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. 

ఓ దశలో కోల్ కతా జట్టు 11.3 ఓవర్లలో 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వెంకటేశ్ అయ్యర్ (3), మన్ దీప్ సింగ్ (0), కెప్టెన్ నితీశ్ రాణా (1), ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ (0)... ఇలా హేమాహేమీలందరూ పెవిలియన్ చేరారు. ఇక ఆ జట్టు కనీసం 150 పరుగులు చేస్తే గొప్ప అని అందరూ భావించారు. 

కానీ, శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ జోడీ బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఫోర్లు, సిక్సర్లతో ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని హోరెత్తించింది. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో ఉత్సాహంగా కనిపించిన బెంగళూరు ఆటగాళ్లు... శార్దూల్, రింకూ ఉతికారేయడంతో ఢీలాపడిపోయారు.

  • Loading...

More Telugu News