vande Bharat: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని

PM modi flags to vande bharat express at secunderabad railway station

  • సికింద్రాబాద్ తిరుపతి మధ్య పరుగులు తీయనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్
  • రైలులోని చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించిన మోదీ
  • ఆపై అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లిన ప్రధానమంత్రి
  • తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ప్లాట్ ఫాంపై సిద్ధంగా ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రధాని జెండా ఊపడంతో ప్రయాణం మొదలు పెట్టింది. అంతకుముందు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఉన్న చిన్నారులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. దేశంలో ఇప్పటి వరకు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లలో ప్రధాని ప్రస్తుతం ప్రారంభించిన వందే భారత్ 13వ రైలు అని అధికారులు తెలిపారు. ఈ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడవనుంది. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ కు బయల్దేరి వెళ్లారు. పరేడ్ గ్రౌండ్స్ సభావేదిక పైనుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. సభావేదికపైకి ప్రధానిని ఆహ్వానించి, ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణకు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాని హైదరాబాద్ కు వచ్చారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించగా.. అందులో రెండు రైళ్లు మన రాష్ట్రానికే వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News