Tirumala: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 48 గంటలు

Huge rush at Tirumala hills

  • వరుసగా సెలవులు
  • పూర్తయిన ఇంటర్ పరీక్షలు
  • తిరుమలకు పోటెత్తిన ఉద్యోగులు, విద్యార్థులు
  • నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ లు
  • భక్తులు సంయమనం పాటించాలన్న టీటీడీ

నిన్న, నేడు, రేపు సెలవులు కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు, ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. 

 భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది. భక్తులకు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి క్యూలైన్లలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయాయి. 

వసతి గదులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. సీఆర్ఓ వద్ద గదుల కోసం క్యూలైన్లలో భక్తులు గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా అత్యధిక సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో, భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 

అయితే, తిరుమలలో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యాత్రికులు తమ పర్యటనను రూపొదించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. సర్వ దర్శనం క్యూలైన్లలో టోకెన్ లేని భక్తులు సంయమనం పాటించాలని సూచించింది. ప్రయాణాలు మరో రోజుకు వాయిదా వేసుకోవాలని కోరుతోంది.

  • Loading...

More Telugu News