Narendra Modi: తమిళనాడులో చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
- తెలంగాణ పర్యటన ముగిశాక తమిళనాడు వెళ్లిన మోదీ
- చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో కార్యక్రమం
- పచ్చజెండా ఊపి వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ
- 5.50 గంటల్లోనే గమ్యస్థానం చేరనున్న చెన్నై-కోయంబత్తూరు రైలు
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగించుకున్నాక తమిళనాడులో అడుగుపెట్టారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన మోదీ... తమిళనాడులోనూ మరో వందేభారత్ రైలును ప్రారంభించారు.
చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పాల్గొన్నారు. కాగా, చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ రైలు కేవలం 5 గంటల 50 నిమిషాల్లోనే గమ్యస్థానం చేరుకుంటుంది.