Manchu Manoj: మంచు మనోజ్ కు రామ్ చరణ్, ఉపాసన సర్ ప్రైజ్ గిఫ్ట్!

manchu manoj thanks ram charan and upasana for surprise gifts
  • చెర్రీ దంపతులు పంపిన బహుమతులను షేర్ చేసిన మంచు మనోజ్ 
  • సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమతో కూడుకున్నవని వ్యాఖ్య
  • చరణ్, ఉపాసన మాల్దీవుల ట్రిప్ అద్భుతంగా సాగాలని ట్వీట్
ఇటీవల మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ కు రామ్ చరణ్, ఉపాసన దంపతులు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు పంపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంచు మనోజ్ వెల్లడించారు. చెర్రీ దంపతులు పంపిన బహుమతులను షేర్ చేసిన ఆయన.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

‘‘ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఎంతో ప్రేమతో కూడుకున్నవి. మాపై ప్రేమను చూపిన స్వీట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు. లవ్ యూ మిత్రమా. మీరు మాల్దీవుల ట్రిప్ ముగించుకుని రాగానే.. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీ ట్రిప్ అద్భుతంగా సాగాలి’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనికా రెడ్డిని ఇటీవల మంచు మనోజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ దంపతులు ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులకు ప్రత్యేక బహుమతులు పంపారు.
Manchu Manoj
Ramcharan
upasana konidela
Surprise gift

More Telugu News