Electric Bike: మార్కెట్లోకి ఏసర్ కొత్త ఈ బైక్

Acer E Bike Super stylish e bike release

  • స్టైలిష్ మోడల్ ను రిలీజ్ చేసిన ఏసర్
  • ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కంప్యూటర్ తయారీ కంపెనీ
  • అత్యాధునిక ఫీచర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ. ప్రయాణం

ఎలక్ట్రానిక్ వాహనాలకు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుండడంతో కొత్త కొత్త కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా మరో కంపెనీ కూడా ఈవీ రంగంలోకి వచ్చేసింది. కంప్యూటర్ల తయారీకి పేరొందిన ఏసర్ కంపెనీ సరికొత్త ఈ బైక్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి ఈ బైక్ (సైకిల్) డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉంది. కేవలం 16 కేజీల బరువుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా ఈ బైక్ పనిచేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్ ను తయారు చేశామంటున్న కంపెనీ.. దీని ధర ఎంతనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ఈ బైక్ ప్రత్యేకతలు..
  • ఏదైనా రాపిడి జరిగితే వెంటనే అలర్ట్ వచ్చేలా బైక్ లో ప్రత్యేక సెన్సార్లను అమర్చారు
  • అధునాతన ట్రాకింగ్ ఫీచర్లతో బైక్ ను వెంటనే ట్రాక్ చేసే ఏర్పాటు
  • దొంగతనం జరిగిన సందర్భాలలో రిమోట్ లాక్ సదుపాయం
  • హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లతో పాటు 360 డిగ్రీ ఎల్ఈడీ లైటింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు
  • 460 డబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ సైకిల్ రిమూవబుల్ బ్యాటరీ. ఫుల్ ఛార్జింగ్ కు 2.5 గంటలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలో మీటర్ల మైలేజ్. గంటకు 25 కిలోమీటర్ల వేగం

  • Loading...

More Telugu News