Corona: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court orders AP govt to give compensation to corona deceased persons families

  • ఏపీలో కరోనాతో 14 వేల మందికి పైగా మృతి
  • నష్ట పరిహారం అందజేయడంలేదన్న పల్లా శ్రీనివాసరావు
  • ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం

ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగించిన కరోనా వైరస్ మహమ్మారి ఏపీపైనా పంజా విసిరింది. రాష్ట్రంలో 14 వేల మందికి పైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు దయనీయ స్థితిలో చిక్కుకున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడంలేదంటూ పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం అందజేయని అంశాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News