MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం

MLC Kavitha Got Avulsion Fractures Rest for 3 Weeks as Doctors Suggest
  • మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
  • ట్విట్టర్ లో వెల్లడించిన ఎమ్మెల్సీ కవిత
  • త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులు
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాలికి గాయం కావడంతో వైద్యులను ఆశ్రయించారు. గాయాన్ని పరీక్షించిన వైద్యులు.. కవితను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా మంగళవారం వెల్లడించారు.

‘నా కాలికి గాయం అవ్వడంతో మూడు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎప్పటిలానే సహాయ సహకారాల కోసం, సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. కాగా, కవితకు గాయం అయిందని తెలిసి ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు.. కవిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


MLC Kavitha
BRS
leg Injury
3 weeks rest

More Telugu News