RSS: సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. ఖుషీలో ఆరెస్సెస్

Supreme Court gives permission for RSS to conduct rallies

  • తమిళనాడులో ఆరెస్సెస్ ర్యాలీలకు అనుమతించిన సుప్రీంకోర్టు
  • మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం
  • తమిళనాడు పిటిషన్ ను కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థాయం

సుప్రీంకోర్టులో తమిళనాడు సీఎం స్టాలిన్ కు చుక్కెదురైంది. రాష్ట్రంలో ఆరెస్సెస్ ర్యాలీలు నిర్వహించుకోవడానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడం, గాంధీ జయంతి సందర్భంగా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని గత ఏడాది అక్టోబర్ లో ఆరెస్సెస్ కోరింది. అయితే, నిషేధిత పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుండి దాడులు జరిగే ముప్పు ఉందని చెపుతూ తమిళనాడు ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. 

దీంతో, గత నవంబర్ లో మద్రాస్ హైకోర్టును ఆరెస్సెస్ ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొన్ని షరతులతో ర్యాలీలకు అనుమతించింది. అనంతరం హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో తమిళనాడులో ర్యాలీలు నిర్వహించుకునేందుకు ఆరెస్సెస్ కు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పుతో ఆరెస్సెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.

  • Loading...

More Telugu News