G Square: తిరుమలలో కాటేజీల నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం ఇచ్చిన చెన్నై సంస్థ
- కాటేజి డొనేషన్ పథకం ప్రవేశపెట్టిన టీటీడీ
- రూ.25.77 కోట్ల డొనేషన్ ప్రకటించిన జీ స్క్వేర్ సంస్థ
- జీ స్క్వేర్ చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రవేశపెట్టిన కాటేజీ డొనేషన్ పథకంలో రికార్డు నమోదైంది. చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. జీ స్క్వేర్ సంస్థ తిరుమల కొండపై రూ.25.77 కోట్లతో హెచ్ వీడీసీ కాటేజీల నిర్మాణం చేపట్టి, ఆ కాటేజీలను టీటీడీకి అందించనుంది. కాటేజ్ డొనేషన్ పథకం కింద తిరుమలలో అతిథి గృహాల నిర్మాణానికి టీటీడీ అనుమతిస్తోంది.