Cow: గో మూత్రం మానవ వినియోగానికి పనికిరాదు.. అందులో హానికారక బ్యాక్టీరియా: ఐవీఆర్ఐ

Cow urine unfit for human consumption Says IVRI Study

  • గోమూత్రంలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న వాదన
  • ఆవులు, ఎద్దుల మూత్రంలో 14 రకాల హానికారక బ్యాక్టీరియా గుర్తింపు
  • బరేలీలోని ఐవీఆర్ఐ పరిశోధనలో తేలిన నిజం

గో మూత్రంలో బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఇది పలు రోగాలను నయం చేస్తుందని చెబుతారు. అయితే, ఈ వాదనలో ఎంతమాత్రమూ నిజం లేదని, ఇది మానవ వినియోగానికి అస్సలు పనికిరాదని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) పరిశోధన తేల్చింది. గో మూత్రంలో హానికారక బ్యాక్టీరియా ఉన్నట్టు పేర్కొంది.

ఆరోగ్యవంతమైన ఆవులు, ఎద్దుల మూత్రంలో 14 రకాల హానికారక బ్యాక్టీరియాను పరిశోధనలో గుర్తించారు. దీనిలోని ఎషిరిచియా కోలి అనే బ్యాక్టీరియా పొట్ట ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని నిర్ధారించారు. ఆవులు, గేదెలతోపాటు 73 మూత్ర నమూనాలను విశ్లేషించినట్టు పరిశోధనలో పాల్గొన్న ఐవీఆర్ఐ ఎపిడిమియాలజీ విభాగాధిపతి భోజ్‌రాజ్ సింగ్‌తోపాటు మరో ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులు తెలిపారు. ఆవులకంటే కూడా గేదెల మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ చర్య ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. గో మూత్రాన్ని మానవ వినియోగానికి సిఫార్సు చేయలేమని భోజ్‌రాజ్ సింగ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News