Sensex: వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డ స్టాక్ మార్కెట్లు
- మార్కెట్లకు బలాన్నిచ్చిన అంతర్జాతీయ సానుకూలతలు
- 235 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 90 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు మన మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 60,393కి పెరిగింది. నిఫ్టీ 90 పాయింట్లు పుంజుకుని 17,812కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.52%), టాటా మోటార్స్ (1.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.27%), ఏసియన్ పెయింట్స్ (1.17%), టెక్ మహీంద్రా (1.08%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.58%), నెస్లే ఇండియా (-1.28%), ఎన్టీపీసీ (-1.24%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.70%).